Breaking News

మృతుల సంఖ్య పెరిగే అవకాశం

May 25, 2019 11:25 by Admin Admin

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో ఓ నాలుగంతస్తుల భవనంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇదే భవనంలోని మూడు, నాలుగో అంతస్తుల్లో ఓ కోచింగ్ సెంటర్ కొనసాగుతున్నది. తరగతులు జరుగుతుండగా అగ్నికీలలు చుట్టుముట్టడంతో పలువురు విద్యార్థులు భయంతో కిటికీల్లో నుంచి కిందకి దూకేశారు. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది విద్యార్థులు మృతిచెందారు. పదుల సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe