Breaking News

ప్రాంగణం చూసి ఎన్టీఆర్ అసంతృప్తికి గురయ్యారు

May 27, 2019 23:21 by Admin Admin

ఎన్టీఆర్ 96వ జయంతి పురస్కరించుకుని  ఘాట్‌ వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయక పోవడం చూసి విస్తుపోయారు. 

Jr. ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్‌తో కలిసి ఘాట్‌ను సందర్శించారు. నివాళులు అర్పించిన అనంతరం అక్కడే కొంతసేపు కూర్చుని తాత జ్ఞాపకాలతో బరువెక్కిన హృదయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలంకరణ లేకుండా కళతప్పినట్లు కనిపించిన ఆ ప్రాంగణం చూసి ఎన్టీఆర్  అసంతృప్తికి గురయ్యారు. ఎన్టీఆర్  ఆదేశాలతో ఆ తర్వాత కొంత సేపటికి ఎన్టీఆర్ ఘాట్ ప్రాంగణం పూలతో ముస్తాబైంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe