Breaking News

బుధవారం 3391 మెగావాట్ల డిమాండ్

May 29, 2019 18:48 by Admin Admin

హైదరాబాద్ విద్యుత్‌రంగంలో సరికొత్త చరిత్ర నమోదయ్యింది. బుధవారం రికార్డుస్థాయిలో 3391 మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది. మంగళవారం  3324 మెగావాట్లుగా ఉంది. ఒక్క రోజు వ్యవధిలోనే 67 మెగావాట్ల డిమాండ్ పెరిగింది. ఈ నెల 20న 3150 మెగావాట్ల అత్యధిక డిమాండ్ నమోదైతే.. మరుసటిరోజే 3276 మెగావాట్లకు చేరడంతో నగర చరిత్రలోనే అది రికార్డుగా నిలిచింది. దీన్నిసైతం తోసిరాజని మంగళవారం 3324 మెగావాట్లు, మరుసటి రోజైన బుధవారం 3391 మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది. రోజురోజూకీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో వేసవితాపం నుంచి ఉపశమనం కోసం ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నిరవధికంగా వాడుతుండటంతో విద్యుత్ డిమాండ్ సైతం రికార్డులను సృష్టిస్తున్నది. ఇంతటి డిమాండ్‌లోనూ కించిత్తైనా అంతరాయం లేకుండా టీఎస్‌ఎస్పీడీసీఎల్ అధికారులు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. గృహ వినియోగానికే కాకుండా, పరిశ్రమలకు సైతం ఇబ్బందిలేకుండా చూస్తున్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe