Breaking News

కారు కొన‌ని ద‌ర్శ‌కుడు

Jun 06, 2019 18:42 by Admin Admin

టాలీవుడ్‌లో నారాయ‌ణ మూర్తి సింపుల్ సిటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.  సినిమాలు చేస్తూ సెల‌బ్రిటీ స్టేట‌స్ పొందిన ఆయ‌న ఇప్ప‌టికి సాదా సీదా జీవితం గడుపుతుంటారు.  ఎటైన వెళ్ళాల‌న్నా రైలులోనో లేదంటే ఆటోలోనో వెళుతుంటార‌ట‌. రీసెంట్‌గా ఓ నెటిజ‌న్‌కి శేఖ‌ర్ క‌పూర్ ఆటోలో వెళ్ళ‌డం ద‌ర్శ‌న‌మిచ్చింది. త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా శేఖ‌ర్‌ని డైరెక్ట్‌గా ప్ర‌శ్నించారు. మీలాంటి సెల‌బ్రిటీలు ఆటోల్లో ప్ర‌యాణించ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని ట్విట్ట‌ర్‌లో అడిగాడు. దీనికి స్పందించిన శేఖ‌ర్.. నేను కారు వాడ‌ను. ముంబైలో కారు వాడ‌డం సిల్లీగా అనిపిస్తుంది. ఒక్క కారు త‌యారు చేసేందుకు ఆరు ల‌క్ష‌ల నీరు అవ‌స‌ర‌మ‌వుతుంది. ఆ నీటిని మ‌నం తినే ఆహారాన్ని పండించుకునేందుకు ఉప‌యోగిస్తే ఎంద‌రికో జీవానాధారం అవుతుంది క‌దా అని శేఖ‌ర్ బ‌దులిచ్చారు. ఆయ‌న స‌మాధానానికి నెటిజ‌న్స్ ప్రశంస‌లు కురిపిస్తున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe