Breaking News

ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు బాలుడి అరెస్ట్

Jun 13, 2019 11:39 by Admin Admin

ఒడిశాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలను క్రియేట్ చేసి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు యత్నించిన ఓ బాలున్ని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.  సంబల్‌పూర్‌కు చెందిన ఓ బాలుడు ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నబా కిషోర్ దాస్, ఎమ్మెల్యేలు నరసింగ మిశ్రా, జయ నారాయణ్ మిశ్రా, సంబల్‌పూర్ జిల్లా కలెక్టర్ శుభం సక్సేనాల పేరిట ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు క్రియేట్ చేశాడు. అనంతరం వారి పేరు చెప్పి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు, పలు ఇతర పనులు చేయించుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో పలువురు నేతలు పోలీసులకు సమాచారం అందించగా వారు రంగంలోకి దిగి ఆ బాలున్ని అరెస్టు చేశారు. కాగా ఆ బాలుడు ఇప్పటికే 100కు పైగా నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలను క్రియేట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సంబల్‌పూర్ పోలీస్ ఎస్పీ సంజీవ్ అరోరా కేసు వివరాలను వెల్లడించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe