Breaking News

భారత్ న్యూజిలాండ్‌కు చెరో పాయింట్

Jun 13, 2019 11:42 by Admin Admin

భారత్, న్యూజిలాండ్ మధ్య ఇవాళ జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఉదయం నుంచి ట్రెంట్ బ్రిడ్జ్ మైదానాన్ని వరుణుడు వదలకపోవడంతో మ్యాచ్ రద్దు అవక తప్పలేదు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వరుణుడు కాస్త గ్యాప్ ఇవ్వడంతో మ్యాచ్‌పై అందరికీ ఆశలు చిగురించినప్పటికీ.. వర్షం మళ్లీ ప్రారంభం కావడంతో మ్యాచ్‌ ఆలస్యమవుతూ వచ్చింది. చివరకు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30కు గ్రౌండ్‌ను తనిఖీ చేసిన అంపైర్లు.. మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ రద్దవడంతో భారత్, న్యూజిలాండ్‌కు చెరో పాయింట్ దక్కింది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe