Breaking News

ట్రంప్‌, కిమ్ భేటీ

Jun 11, 2018 20:11 by Admin Admin

 అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఉత్తరకొరియా అధినేత కిమ్ భేటీ అయ్యారు. ఈ చారిత్రక సమావేశానికి సింగపూర్ వేదికైంది. సెంతోసా దీవిలోని కాపెల్లా హోటల్‌లో  ఈ ఇరువురు దేశాధినేతలు శాంతి చర్చల్లో పాల్గొన్నారు. ట్రిప్ కిమ్ సమావేశమైన హోటల్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ట్రంప్, కిమ్ ఏకాంతంగానే సమావేశమయ్యారు. ఉత్తరకొరియా పూర్తిగా అణునిరాయుధీకరణకు ట్రంప్ కోరుతున్నారు. అటు తమ దేశంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కిమ్ పట్టుబడుతున్నారు. అయితే ఈ శిఖరాగ్ర సమావేశం అజెండా ఏంటన్నది రహస్యంగా ఉంచారు. ట్రంప్, కిమ్ ఏకాంత భేటీ తర్వాత ఇరుదేశాలకు చెందిన ప్రతినిధి బృందాల సమక్షంలో వారు మరోసారి సమావేశమవుతారు.

 
అమెరికా, ఉత్తరకొరియా దేశాధినేతల భేటీని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా కిమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపైనే అందరి దృష్టి ఉంది. అదీగాక సమావేశం సజావుగా సాగకపోతే తాను భేటీ మధ్యలోనుంచి వెళ్లిపోతానంటూ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. దాంతో అమెరికా అధ్యక్షుడి వ్యవహార తీరు కూడా ఆసక్తిని రేపుతోంది. ఒకవేళ చర్చలు ఫలిస్తే కొరియా ద్వీపకల్పనలో శాంతి నెలకొంటుంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe