Breaking News

సామ్రాట్ తేజస్వీలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంటారు

Jul 04, 2018 11:34 by Admin Admin

బిగ్ బాస్ హౌజ్‌లో సామ్రాట్, తేజస్వీలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంటారు. ఆ విషయం షో మొదలైనప్పటి నుంచి తెలుస్తూనే ఉంది. తాజాగా ఇవాళ్టి షోలో వారిద్దరి మధ్య అనుబంధం ఎంత దృఢమైనదో మరోసారి తెలిసింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా ఈ ఇద్దరూ లవ్ బర్డ్స్‌గా నటిస్తున్నారు. అయితే వాళ్లు నిజమైన లవర్స్‌ను మించి చేస్తున్నారు. అచ్చమైన ప్రేమ జంటలా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా సామ్రాట్‌పై తేజస్వీ ప్రశంసల వర్షం కురిపించింది. చాలా ధైర్యవంతుడని.. అతి మంచోడని కితాబిచ్చింది. తన బర్త్ డే గిఫ్ట్‌ సామ్రాట్టేనని తెలిపింది. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి రావోయి చందమామ పాటకు డ్యాన్స్ చేసి అలరించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe