Breaking News

కత్తిమహేష్‌ తీరును పరిపూర్ణానందస్వామి తీవ్రంగా తప్పుపట్టారు

Jul 04, 2018 11:43 by Admin Admin

ఇప్పటికే కత్తిమహేష్‌ తీరును పరిపూర్ణానందస్వామి తీవ్రంగా తప్పుపట్టారు. హిందువు కానప్పుడు, హిందూమతం జోలికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. బాబు గోగినేని ఒక ఉన్మాదపు క్రీడ అయితే.. కత్తి మహేష్ ఉన్మాద క్రీడకు పరాకాష్టని స్వామి అభివర్ణించారు. ఉన్మాదుల టీమ్‌కు ఆయన కెప్టెన్ అని, కత్తి మహేష్ కథలు చెప్పుకుంటూ, రాసుకుని బతుకుతారని విమర్శించారు. సీత.. రాముడు దగ్గర కంటే రావణాసురుడు దగ్గరైతే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుందని వ్యాఖ్యలు చేసి సమాజానికి ఏం చెప్పలచుకున్నారని ఆయన ప్రశ్నించారు. కత్తిమహేష్ దేనికి అమ్ముడుపోయి ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడంలేని స్వామి అన్నారు. కనిపించిన ప్రతివారిపై దమ్మెత్తిపోస్తుంటారని మండిపడ్డారు. ‘నీకు రాముడు దగుల్బాజీ... వర్మ దేవుడు’ అని పరిపూర్ణానంద స్వామి ఎద్దేవా చేశారు. అనవసరంగా ఒక ధర్మాన్ని, దేవతలను, గ్రంథాల జోలికి వస్తే... తాము అడుక్కోవలసిన పనిలేదని, ప్రభుత్వం చేయాల్సిన పని చేయకపోతే, పోలీసులు పట్టించుకోకపోతే.. ఏ రకంగా పరిష్కరించుకోవాలో తమకు తెలుసునని పరిపూర్ణానంద స్వామి అన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe