Breaking News

జియో ఫోన్ 2 ఫీచర్ల

Jul 05, 2018 12:03 by Admin Admin

రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంలో ఆ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ ‘జియో ఫోన్2’ను తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. గతేడాది జియో తీసుకొచ్చిన 4జీ ఫీచర్ ఫోన్‌కు దీనిని అప్‌డేటెడ్‌గా చెప్పుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ కాకున్నా అందులోని ఫీచర్లు ఇంచుమించు అన్నీ ఈ ఫోన్‌లో ఉండడం విశేషం. జియో ఫోన్ 2 ధర రూ.2,999 మాత్రమే. ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి రానుంది.
 
జియో ఫోన్ 2 ఫీచర్ల విషయానికి వస్తే.. క్వెర్టీ కీప్యాడ్, 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, ఆల్ఫాన్యూమెరిక్ కీప్యాడ్, డ్యూయల్ సిమ్, కేఏఐ ఓఎస్, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ మెమొరీ, 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, 2 మెగాపిక్సల్ వెనక, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ, వీవోఎల్‌టీఈ, వీవోవైఫై, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో, వాయిస్ కమాండ్ తదితర ఫీచర్లు ఉన్న ఈ ఫోన్‌లో వాట్సాప్, యూట్యూబ్‌లు కూడా ఉండడం విశేషం.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe