Breaking News

ఐడియా సెల్యూలార్‌ను దాటేసి

Jul 05, 2018 12:08 by Admin Admin

రెండేళ్ల క్రితం టెలికం రంగంలోకి అడుగుపెట్టి సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించింది. రెండేళ్లలోనే దేశంలోని అగ్రగామి టెలికం కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. ఇప్పుడు దేశంలో మూడో అతిపెద్ద టెలికం కంపెనీ అయిన ఐడియా సెల్యూలార్‌ను దాటేసి దానిని స్థానాన్ని ఆక్రమించేందుకు రెడీ అయింది. సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ నాటికి ఐడియాకు 21.67 కోట్ల మంది ఖాతాదారులు ఉండగా, జియో రెండేళ్లలోనే 21.5 కోట్ల ఖాతాదారులను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఏడాది క్రితం 12.3 కోట్ల మంది ఖాతాదారులను కలిగిన జియో ఇప్పుడా సంఖ్యను రెండింతలు చేసుకోవడం విశేషం. కేవలం 22 నెలల్లోనే 215 మిలియన్ల మంది ఖాతాదారుల బేస్ సాధించామని ముకేశ్ అంబానీ తెలిపారు. ప్రపంచంలోనే టెక్నాలజీ కంపెనీకి ఇది సాధ్యం కాలేదని ఆయన పేర్కొన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe