Breaking News

నవాజ్‌ షరీ్‌ఫకు 10 ఏళ్ల జైలుశిక్ష పడింది

Jul 06, 2018 16:25 by Admin Admin

పనామా పేపర్ల కుంభకోణం కేసులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీ్‌ఫకు 10 ఏళ్ల జైలుశిక్ష పడింది. లండన్‌లోని ఎవెన్‌ ఫీల్డ్‌ హౌస్‌లో నాలుగు విలువైన ఫ్లాట్లపై యాజమాన్య హక్కు దక్కించుకోవడంలో చోటుచేసుకున్న అవినీతికి సంబంధించి ఈ కేసు నమోదైంది. గతంలో నాలుగుసార్లు తీర్పును వాయిదా వేసిన కోర్టు ఎట్టకేలకు శుక్రవారం వెలువరించింది. గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న తన భార్య చికిత్స కోసం షరీఫ్‌ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. నవాజ్‌తోపాటు ఆయన కుమార్తె మర్యంకు ఏడేళ్లు, అల్లుడు కెప్టెన్‌ (రిటైర్డ్‌) సఫ్దర్‌కు కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. దీంతోపాటు నవాజ్‌కు రూ.68 కోట్లు, మర్యంకు రూ. 18 కోట్ల జరిమానా విధించింది. ఈ నెల 25న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ తీర్పు వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. మూడుసార్లు ప్రధానిగా పని చేసిన షరీ్‌ఫను అవినీతి కేసు నేపథ్యంలో పదవికి అనర్హుడిగా సుప్రీం ప్రకటించడం, ఆపై ఆయన ప్రధాని పదవి నుంచి అర్ధాంతరంగా వైదొలగడం తెలిసిందే.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe