Breaking News

వివాదంలో శబాష్ రాయుడు చిత్రం

Jul 06, 2018 16:30 by Admin Admin

కమల్ హాసన్ సినిమాలు వివాదం లేకుండా విడుదలవడం అసాధ్యం అనేలా మారుతున్నాయి. మొన్నటి వరకు ‘విశ్వరూపం’ విషయంలో ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న కమల్ హాసన్ ఇప్పుడు చేస్తున్న ‘శభాష్ నాయుడు’ చిత్రంతో కూడా వివాదాలను ఫేస్ చేస్తున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా, ‘శభాష్ నాయుడు’ చిత్రం నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుని, మిగిలిన షూటింగ్‌ని జరుపుకుంటోంది. ఈ చిత్రాలతో పాటు బిగ్‌బాస్ 2 హోస్ట్‌గా కూడా కమల్ అందరికీ టచ్‌లోనే ఉన్నారు.
 
అయితే ఇప్పుడు కమల్ చేస్తున్న ‘శభాష్ నాయుడు’ చిత్రం విషయంలో కమల్ ఫేస్ చేస్తున్న వివాదం ఏమిటంటే.. టైటిల్. ఈ టైటిల్‌లో ‘నాయుడు’ అని ఉండటం, ఓ క్యాస్ట్‌ని ప్రస్తావిస్తుందని, వెంటనే చిత్ర టైటిల్‌ని మార్చాలని, లేదంటే సినిమా విడుదలను అడ్డుకుంటామని కమల్‌ను కొందరు బెదిరిస్తున్నారట. దీనికి ‘‘మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. టైటిల్ మాత్రం మార్చే ప్రసక్తే లేదు’’ అంటూ కమల్ ఖరాఖండీగా చెప్పేశారట. కమల్ తనయ శృతిహాసన్ నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe