Breaking News

క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు

Jul 06, 2018 16:34 by Admin Admin

సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ముంబై వస్తున్న హీరోయిన్ల వల్లే వెలుగులోకి వచ్చిందని, అంతకు ముందు ఇలాంటివి ఎవరికీ తెలియవని ఆమె చెప్పుకొచ్చారు. తాజాగా ఓ మ్యాగ్‌జైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె క్యాస్టింగ్ కౌచ్ గురించి తన అభిప్రాయం తెలిపారు.
 
ఆమె మాట్లాడుతూ.. ‘‘క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలేమీ నాకు లేవు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాల్లో ఉన్నాను. సినిమా అవకాశాల కోసం నేను ఎవరినీ సంప్రదించలేదు. నా సినిమాలన్నీ విజయాలు సాధించడంతో నాకు ఆ అవసరమే రాలేదు. అయితే క్యాస్టింగ్ కౌచ్ అనేది ముంబై వస్తున్న హీరోయిన్ల వల్లే జరుగుతోంది. టాప్ హీరోయిన్లు అయిపోవాలని కొందరు రాజీపడటం వల్లే ఈ క్యాస్టింగ్ కౌచ్ జరుగుతుంది. క్యాస్టింగ్ కౌచ్ పక్కన పెడితే సినిమాల్లోకి రావాలనే కోరిక మాత్రం ఇప్పుడున్న అమ్మాయిల్లోనే కాకుండా, వారి తల్లిదండ్రులలో కూడా పెరుగుతుంది. అందుకే డ్యాన్సులు, నటన వంటివి కూడా నేర్పుతున్నారు..’’ అని తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe