Breaking News

రాజపాలెంలో ఈ ఘోరం జరిగింది

Jul 06, 2018 16:43 by Admin Admin

తమిళనాడులో దారుణం జరిగింది. భార్యను నడిరోడ్డుపై వేటకత్తితో నరికేశాడో భర్త. దిండిగల్ జిల్లా రాజపాలెంలో ఈ ఘోరం జరిగింది. గత నెల 20న జరిగిన ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీనీ విడుదల చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. మదీశ్వరన్, ప్రియ భార్యాభర్తలు. రాజపాలెం బస్టాండ్‌కు సమీపంలో ప్రియను.. వేటకత్తితో అత్యంత దారుణంగా నరికేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంత జరుగుతున్నా.. చుట్టూ ఉన్నవాళ్లు ఎవరూ రాలేదు. ఒక వ్యక్తి మాత్రం పరిగెత్తుకు వచ్చే లోపు మదీశ్వరన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ప్రియను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించింది. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా మదీశ్వరన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కుటుంబ కలహాలతోనే ఈ దారుణానికి ఒడిగడినట్టు తెలుస్తోంది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe