Breaking News

హువేయి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల

Jul 06, 2018 16:47 by Admin Admin

తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు చైనాకు చెందిన ప్రముఖ హువేయి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. చైనా మార్కెట్‌లోకి హనర్ 10జీటీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ ప్రకటించింది. హనర్ 10జీటీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి. 8జీబీ ర్యామ్, 5.84 అంగుళాల పూర్తి స్థాయిలో హెచ్‌డీతోపాటు 19:9 రేషియో స్క్రీన్, 24 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా, 16ఎంపీ సెన్సార్, 24ఎంపీ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, 128జీబీ అంతర్గత స్టోరేజ్, 3డీ ఫిల్టర్స్ ఈ ఫోన్‌కు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇండియా మార్కెట్‌లోకి ఈ ఫోన్‌ను ఎప్పుడు విడుదల చేస్తారన్నది ఇంకా ప్రకటించలేదు. విడుదల అనంతరం భారత మార్కెట్‌లో ఈ ఫోన్ ధర రూ. 32,999గా ఉండొచ్చని తెలుస్తోంది.
 
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe