Breaking News

టీడీపీకి సమయం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు

Jul 06, 2018 16:54 by Admin Admin

ఏపీలో టీడీపీ భౌతికదాడులకు దిగుతోందని మండిపడ్డారు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కృష్ణం రాజు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న టీడీపీకి సమయం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రతివారం ఐదు ప్రశ్నలు అడుగుతున్నా.. వాటికి పొంతనలేకుండా సమాధానమిస్తూ టీడీపీ నేతలు... ప్రజలను గందరగోళపరుస్తున్నారన్నారు. కన్నా లక్ష్మీనారాయణపై చెప్పులు వేసి రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ప్రజలు మెచ్చుకొనేలా మంచిపనులు చేయాలని సూచించారు. 
 
 
మరోవైపు పంటలకు మద్దతుధర ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వరి పంటకు 200 మద్దతు ధర ప్రకటించటం వల్ల ఎకరాకు కనీసం 6 వేల నుంచి 8 వేల లాభం రైతుకు చేకూరుతుందన్నారు. జులై మొదటివారంలో మద్దతు ధర ప్రకటించటంతో రైతులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపశమనం లభిస్తుందని.. పంట కొనుగోలు భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడకుండా కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయటమే బీజేపీ లక్ష్యం అని కృష్ణంరాజు చెప్పారు. పంటలకు మద్దతు ధర ప్రకటించటం పట్ల మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. 33 ఏళ్లలో ఇంత పెద్ద మొత్తంలో మద్దతు ధర పెరగలేదని.. బీజేపీ రైతు పక్షపాతి అనడానికి ఇదే నిదర్శనమన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe