Breaking News

సెమీఫైౖనల్లో ఇంగ్లండ్‌

Jul 07, 2018 21:20 by Admin Admin

  • సెమీఫైౖనల్లో ఇంగ్లండ్‌
  • క్వార్టర్స్‌లో స్వీడన్‌ చిత్తు 
ఇంగ్లండ్‌ అదరగొట్టింది..ఫేవరెట్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తూ సెమీఫైనల్‌కు  దూసుకుపోయింది. క్వార్టర్‌ఫైనల్లో స్వీడన్‌పై అన్నివిధాలా పైచేయి సాధించింది. 2-0తో గెలుపొంది1990 తర్వాత తొలిసారి సెమీస్‌ బెర్త్‌ దక్కించుకుంది. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన స్వీడన్‌.. కొన్నిసార్లు అవకాశాలు సృష్టించుకున్నా వాటిని ఇంగ్లండ్‌ కీపర్‌ అమోఘంగా అడ్డుకోవడంతో ఖాతానే తెరవలేక పోయింది.
 
ఫిఫా కప్‌లో ఇంగ్లండ్‌ జోరు కొనసాగుతోంది. స్వీడన్‌తో క్వార్టర్స్‌ పోరులో అన్ని రంగాల్లో అద్భుత ప్రదర్శన కనబరించింది. ఫలితంగా సునాయాస విజయంతో టైటిల్‌కు రెండు మ్యాచ్‌ల దూరంలో నిలిచింది. హ్యారీ మగ్వైర్‌ (30వ నిమిషం) తొలి గోల్‌తో ఇంగ్లండ్‌ను ఆధిక్యంలో నిలిపితే డేలి అల్లీ (58వ నిమిషం) రెండో గోల్‌తో జట్టు అధిక్యాన్ని డబుల్‌ చేశాడు. రష్యా-క్రొయేషియాల మధ్య జరిగే క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌ విజేతతో ఈనెల 11న మాస్కోలో జరిగే సెమీ్‌సలో ఇంగ్లండ్‌ తలపడనుంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe