Breaking News

శ్రీవారి సన్నిధిలో బోనీకపూర్ ఇద్దరు కుమార్తెలు

Jul 07, 2018 21:33 by Admin Admin

సినీనటి శ్రీదేవి భర్త బోనీకపూర్, ఆమె ఇద్దరు కుమార్తెలు ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. బోనీకపూర్ ఎప్పుడు తిరుమలకు వచ్చినా శ్రీదేవితో కలిసి వచ్చేవారు. అయితే... శ్రీదేవి ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తన ఇద్దరు కుమార్తెలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఎప్పుడు దర్శనానికి వచ్చిన శ్రీదేవితో కలిసివచ్చిన బోనీకపూర్... ఈసారి ఆమె లేదనే బాధ ఆయనలో స్పష్టంగా కనిపించింది. కాగా... దర్శనానంతరం బోనీకపూర్ కుటుంబసభ్యులు స్వామి వారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe