Breaking News

బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి..తహశీల్దార్ విజయారెడ్డి హత్య వెనుక సంచలన విషయాలు

Nov 04, 2019 21:53 by Admin Admin

 అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయరెడ్డి హత్య ఎలా జరిగింది ? నిందితుడు ఏ వ్యుహాన్ని అనుసరించాడు ..? పెట్రోల్ బాటిల్ తీసుకెళ్లిన సిబ్బంది గుర్తించకపోవడానికి కారణమెంటీ..? విజయారెడ్డిపై సురేశ్ దాడి చేసి.. పెట్రోల్ పోసిన అడ్డుకోలేకపోవడానికి కారణమేంటీ..? దీనిపై ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు ..? ఇంతకీ సోమవారం మధ్యాహం 1.30 గంటల నుంచి 1.40 గంటల మధ్య ఏం జరిగింది. వన్ ఇండియా ప్రత్యక కథనం.


అదనుచూసి.. 
సోమవారం మధ్యాహ్నం.. అంతా నిర్మానుష్యం... ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కానీ అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో మాత్రం అలజడి.. అవును అప్పుడే భవనంలోకి సురేశ్ అనే రాక్షసుడు అడుగిడాడు. తనతో పెట్రోల్ తీసుకొచ్చాడు. బాటిల్ తీసుకొచ్చి.. నేరుగా తహశీల్దార్ చాంబర్‌లోకి అడుగుపెట్టాడు. తన భూమికి సంబంధించి పట్టా చేయాలని తహశీల్దార్‌తో వాగ్వివాదం జరిగింది. అప్పటికే ఆగ్రహావేశంతో రగిలిపోతున్న సురేశ్ తన వికృతరూపాన్ని చూపించాడు. గదిలోకి అడుగుపెడుతూనే లాక్ చేయగా.. తనతో తీసుకొచ్చిన పెట్రోల్‌‌ను విజయారెడ్డిపై పోసి నిప్పంటించాడు. దీంతో హాహాకారాలు చేస్తూ విజయారెడ్డి బయటకొచ్చారు. కానీ అప్పటికే పూర్తిగా కాలిపోవడంతో లాభం లేకపోయింది.

కలుద్దామని వచ్చి.. సోమవారం గ్రీవెన్స్ సెల్ ఉంటుందని.. అప్పటివరకు మేడమ్ తమతోనే ఉన్నారని రెవెన్యూ ఇన్ స్పెక్టర్ చెబుతున్నారు. సాధారణంగా ప్రతీ సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గ్రీవెన్స్ సెల్ ఉంటుందని తెలిపారు. సోమవారం కూడా చాలా మంది ఉండటంతో.. ఒక్కొక్కరికి సంబంధించిన ఆర్జీలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఇంతలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యిందని చెప్పారు. వెంటనే వెళ్లగా మేడమ్ తగలబడుతున్నారని తెలిసింది. డ్రైవర్, అటెండర్ వచ్చి సాయం చేశారని.. మేం కూడా వెళ్లి ఓ మహిళ పడి ఉంటే కార్పెట్ కప్పినట్టు వివరించారు.

ఎత్తిన చెయ్యి మేడమ్‌దే.. మేడం ఎక్కడ అని అడగగా.. చేయి ఎత్తారని పేర్కొన్నారు. అప్పుడు తెలుసుకున్నామని చెప్పారు. మేడమ్ 80 శాతం గాయపడ్డారని.. అక్కడికక్కడే చనిపోయారని తెలిపారు. నిందితుడికి సంబంధించి ఏడేకరాల భూమికి సంబంధించి పట్టా చేయడం లేదా అని మీడియా ప్రతినిధులు అడిగితే తనకు తెలిసి లేదని చెప్పారు. తాను ఇక్కడికి వచ్చి 3 నెలలు అవుతుందని చెప్పారు. 87-101 సర్వే నెంబర్లకు సంబంధించి జేసీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.

సజీవదహనం చేసి.. ఘటనపై మరో స్థానికుడు కూడా మీడియాకు వివరాలు వెల్లడించారు. తాను కూడా ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చానని చెప్పారు. అటుగా వెళ్లడంతో వైన్స్ షాపు వద్ద ఒకరు కనిపించారని.. అతన్ని పిచ్చొడు అనుకున్నాని తెలిపారు. కానీ ఆఫీసు వద్దకొచ్చేసరికి తెలిసింది.. మేడమ్‌ను హతమార్చింది అతనేని నిర్ధారణ అయ్యిందన్నారు. కానీ అతని మొహం కనిపించలేదని.. అతను కూడా బాగానే కాలిపోయాడని పేర్కొన్నారు.

లొసుగు ఇదే.. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న లొసుగు నిందితుడు సురేశ్‌కు కలిసొచ్చింది. తహశీల్దార్ ఫస్ట్ ప్లోర్‌లో ఉంటారు. అయితే ఆమెను కలిసేందుకు మరో దారి కూడా ఉండటం.. దానిని సురేశ్ అనుకూలంగా మార్చుకున్నాడు. సెల్లార్ ద్వారా కిందకు వెళ్లాడు. అక్కడినుంచి ఉన్న మెట్ల ద్వారా ఫస్ట్ ఫ్లోర్ వెళ్లాడు. దీంతో తనతో బాటిళ్లో పెట్రోల్ తీసుకొచ్చిన చూసే నాథుడే లేడు. అలా వెళ్లి అటెండర్‌కు చెప్పి.. చాంబర్‌లోకి వెళ్లాడు. ఇక్కడ సురేశ్ తన తెలివిని ప్రదర్శించాడు.

రెప్పపాటులో.. గదిలోకి వెళ్లిన వెంటనే లాక్ వేయడం., దానిని మేడమ్ గుర్తించకపోవడం కాస్త అనుమానపడే అంశమే. పట్టా విషయంలో గొడవ జరిగి.. విజయారెడ్డిపై దాడి చేయడంతో సురేశ్ పన్నాగం అర్థమైపోయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తనతో తీసుకొచ్చిన పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తహశీల్దార్ సజీవదహనమయ్యారు

Facebook like
Google Plus Circle
Youtube Subscribe