Breaking News

మోదీకి ఏపీ సీఎం లేఖ

Nov 05, 2019 04:31 by Admin Admin

ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ రాశారు. ఒడిశా తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్‌కో థర్మల్‌ ప్లాంట్‌కు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విభజన తర్వాత సింగరేణి కోల్‌ కాలరీస్‌ను తెలంగాణకు ఇచ్చారని, కనీసం బొగ్గు నిల్వల్లో వాటాను కూడా ఏపీకి ఇవ్వలేదని లేఖలో జగన్‌ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచే వచ్చే బొగ్గు మీదే ఆధారపడుతున్నామని, దాని వల్ల విద్యుత్‌ రంగంలో భరోసా లేకుండా పోయిందని ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖలో తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe