Breaking News

కలాం పేరు తొలగింపుపై వెనక్కు తగ్గింది.

Nov 05, 2019 21:37 by Admin Admin

పదో తరగతితో చక్కని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిఏటా ‘డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారం’ అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తూ వస్తోంది. అయితే భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పేరిట ఉన్న ఈ అవార్డుని.. వైఎ్‌సఆర్‌ విద్యా పురస్కారంగా మార్చుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అబ్దుల్‌ కలాం వంటి మహనీయుని పేరు తీసేసి వైఎ్‌సఆర్‌ పేరు పెట్టడంపై అన్ని వర్గాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఒక్కరోజులోనే సర్కారు దిగొచ్చింది. కలాం పేరు తొలగింపుపై వెనక్కు తగ్గింది. ఈ అవార్డులను యథాతథంగా అబ్దుల్‌ కలాం పేరునే కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంగళవారం అధికారులను ఆదేశించారు. తనకు తెలియకుండానే పేరు మార్చారంటూ పాఠశాల విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe