Breaking News

ఇంకా విడాకులు రాకుండానే వివాహం

Nov 17, 2019 23:52 by Admin Admin

కృష్ణానగర్‌కు చెందిన బి. అశోక్‌, జ్యోతిశ్వరి 20 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 18 సంవత్సరాల కుమారుడు, 15 సంవత్సరాలు కుమార్తె ఉన్నారు. 2016లో జ్యోతిశ్వరి ఖమ్మం జిల్లాకు చెందిన వేణుగోపాలరావుతో ప్రేమలో పడింది. దీంతో దంపతుల మధ్య విబేధాలు తలెత్తాయి. విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సిటీ సివిల్‌ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జ్యోతిశ్వరి ఇంకా విడాకులు రాకుండానే వేణుగోపాల్‌ను వివాహం చేసుకుందని, ఇది చట్ట విరుద్దమని పేర్కొంటూ అశోక్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe