Breaking News

తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్

Nov 22, 2019 16:07 by Admin Admin

 భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న డే/నైట్ టెస్ట్ అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 106 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్ ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 68 పరుగుల ఆధిక్యం లభించింది. మయాంక్ అగర్వాల్ (14), రోహిత్ శర్మ (21) స్వల్ప స్కోర్లకే అవుటవగా, చతేశ్వర్ పుజారా అర్ధ సెంచరీ (55) చేశాడు. డే/నైట్ టెస్టులో తొలి అర్ధ సెంచరీ సాధించిన ఆటగాడిగా పుజారా రికార్డులకెక్కాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (59), అజింక్య రహానే (23) క్రీజులో ఉన్నారు.

 
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe