Breaking News

సెంచరీలు చేయడంలో కోహ్లీ ఘనత

Nov 23, 2019 03:56 by Admin Admin

కార్డుల వీరుడు కోహ్లీ మరో రికార్డు నమోదు చేశాడు. అర్ధ సెంచరీలను సెంచరీలుగా మలచడంలో విజయవంతమైన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. లెజండరీ బ్యాట్స్‌మెన్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఈ ఘనత సాధించాడు. 69 కన్వర్షన్ రేట్‌తో డాన్ బ్రాడ్‌మన్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిస్తే.. రెండో స్థానంలో కోహ్లీ(55.1) నిలిచాడు. భారత క్రికెటర్లలో 51.1 కన్వర్షన్ రేట్‌తో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మాత్రమే టాప్ టెన్‌లో ఉన్నాడు. కోహ్లీ తన టెస్ట్ క్రికెట్ కెరీర్‌లో మొత్తం 27 సెంచరీలు, 22 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe