Breaking News

తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం సంచలన నిర్ణయం

Nov 25, 2019 18:40 by Admin Admin

 తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. సమ్మె విరమించినా కార్మికులను విధుల్లోకి తీసుకునేది లేదని స్పష్టం చేసింది.  ఆర్టీసీ తాత్కాలిక ఎండీ సునీల్ శర్మ స్పష్టమైన ప్రకటన చేశారు. సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ కార్మికులు చేసిన ప్రకటనపై స్పందించిన సునీల్ శర్మ.. కార్మికులను విధుల్లోకి తీసుకోకూడదని ఆర్టీసీ నిర్ణయించినట్లు తెలిపారు. జేఏసీ నిర్ణయం హాస్యాస్పందంగా ఉందన్నారు. పండుగ సమయాల్లో అనాలోచిత సమ్మె చేశారని ఆర్టీసీ కార్మికుల నిర్ణయాన్ని సునీల్ శర్మ తప్పుపట్టారు. ఇదే సమయంలో సమ్మె విరమణ ప్రకటనను కూడా సునీల్ శర్మ తప్పుపట్టారు. ఓవైపు పోరాటం కొనసాగుతుందని చెబుతూనే.. మరోవైపు సమ్మె విరమణ అంటున్నారని మండిపడ్డారు. కార్మికులు ఇష్టమొచ్చినట్లు విధులకు గైర్హాజరై.. ఇష్టమొచ్చినప్పుడు మళ్లీ విధుల్లోకి చేరుతారా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ గానీ, ప్రభుత్వం గానీ సమ్మె చేయమని చెప్పలేదన్నారు. కార్మికులు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారని అన్నారు. దీనిపై కార్మికశాఖ కమిషనర్ సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అంతా చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం జరుగుతుందన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe