Breaking News

4 కోట్లు వచ్చాయని ఇది నిజమని ఆశపడిన

Nov 25, 2019 18:45 by Admin Admin

 లాటరీలో రూ.4 కోట్లు వరించాయన్న మాటలకు ఈ విద్యార్థి ఆశపడ్డాడు. ఈ సొమ్మును పొందేందుకు పలు దఫాలుగా రూ.90 వేలు చెల్లించి.. చివరికి మోసపోయాడు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటకు చెందిన సాయికుమార్‌కు ఇటీవల ఓ లాటరీలో రూ.4 కోట్లు వచ్చాయని, ఆ డబ్బును పొందాలంటే కొద్దిమొత్తంలో డబ్బులు డిపాజిట్‌ చేయాలని అతనికి ఈ-మెయిల్‌ వచ్చింది. ఇది నిజమని ఆశపడిన సాయికుమార్‌.. ఆ మెయిల్‌లో సూచించిన మేరకు బ్యాంకు ఖాతాకు పలు దఫాలుగా రూ.90 వేలు బదిలీ చేశాడు. అయినా తనకు లాటరీ డబ్బుకు పంపకపోగా, అపరిచిత వ్యక్తి ఇంకా నగదు బదిలీ చేయాలని ఫోన్‌లో కోరడంతో అనుమానం వచ్చింది. తిరిగి ఆ ఫోన్‌ నంబరు కాల్‌ చేయగా స్విచ్చాప్‌ వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe