Breaking News

ప్రైవేటుకు చోటిస్తూ దాన్నీ నడిపిస్తాం

Nov 25, 2019 18:48 by Admin Admin

 ఆర్టీసీని యథాతథంగా నడపటం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇప్పట్లాగే కొనసాగించాలంటే ప్రభుత్వం నెలకు రూ.640 కోట్లు భరించాల్సి ఉంటుందన్నారు. అన్ని నిధులను సమకూర్చుకొనే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని చెప్పారు. కేంద్రం ఇటీవల సవరించిన మోటారు వాహన చట్టాన్ని అనుసరించి రూట్లపై ఆర్టీసీకి ఉన్న గుత్తాధిపత్యాన్ని తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు చట్టాన్ని రాష్ట్రానికి అన్వయం చేసుకున్నామని తెలిపారు. ఆ చట్టం ప్రకారమే రూట్లను ప్రైవేటీకరిస్తున్నట్లు వివరించారు. రవాణా చార్జీల నియంత్రణకు స్వతంత్ర సంస్థ ఉంటుందని, ఆ సంస్థ నిర్ధారించిన చార్జీలనే ఆయా రూట్లలో ప్రైవేట్‌ ఆపరేటర్లు వసూలు చేస్తారని చెప్పారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe