Breaking News

వ్యభిచార దందా చేస్తున్న భార్యభర్తలపై పీడీ యాక్ట్‌ను విధించారు

Nov 25, 2019 18:55 by Admin Admin

బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చి హైదరాబాద్ మియాపూర్ స్థిరపడి వ్యభిచార దందా చేస్తున్న భార్యభర్తలపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ సోమవారం పీడీ యాక్ట్‌ను విధించారు. సోహేల్ హూస్సేన్ 10 ఏండ్ల కిందట బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి బెంగళూరులో కొద్ది కాలం నివాసం ఉన్నాడు. అక్కడ దొంగ దారిలో ఓటరు కార్డు పొందాడు. ఆ తర్వాత మియాపూర్ ప్రాంతానికి వచ్చి స్థిరపడి ఓ కార్పోరేట్ కంపెనిలో ప్లంబర్ కార్మికుడి పని చేస్తున్నాడు. నాలుగు ఏండ్ల కిందట బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన విస్టీ ని పెండ్లీ చేసుకున్నాడు. వారికి వస్తున్న నగదు ఆదాయం సరిపోకపోవడంతో వ్యభిచార దందాకు శ్రీకారం చుట్టాడు. దీంతో బంగ్లాదేశ్‌కు చెందిన స్నేహితుడితో ఓ యువతిని తీసుకువచ్చి రొంపిలోకి దించారు. అంతేకాకుండా ఆ యువతిని విజయవాడలోని ఓ వ్యభిచార గృహం నిర్వహాకులకు అమ్మేశాడు.ఇలా కస్టమర్‌లను సంప్రదించి చేస్తున్న అక్రమ వ్యాపారంపై సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు ఈ ఇద్దర్నీ అగస్టు నెలలో అరెస్టు చేశారు. వీరి నుంచి అమాయక యువతులకు ప్రమాదం ఉండడంతో సీపీ మహేష్ భగవత్ పీడీ యాక్ట్‌ను విధించి ఏడాది పాటు జైలులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.వీరి వలలో చిక్కిన యువతిని కాపాడి ప్రజ్వల కేంద్రానికి తరలించి అక్కడి నుంచి ఆమె తల్లికి అప్పగించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe