Breaking News

ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

Nov 27, 2019 01:23 by Admin Admin

రిపబ్లిక్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘రిపబ్లిక్ సమ్మిట్‌’లో ప్రధాని మోదీ తమ జీవితకాలంలో చూడగలమా అని భారతీయులనుకున్న అనేక అంశాలను తాము సాకారం చేశామన్నారు. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావించిన మోదీ.. కొన్ని కుటుంబాలు రాజకీయ స్వార్థంతో ఆర్టికల్ 370 శాశ్వతమనే అభిప్రాయం కల్పించాయని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ ప్రభుత్వం ఇది అవాస్తవమని నిరూపించిందన్నారు.
 
ట్రిపుల్ తలాక్‌ను నిషేధించడం ద్వారా ముస్లిం మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల్ని నిరోధించామని తెలిపారు. ఆధార్ విషయంలో కూడా కొందరు అపోహలు కలిగించే ప్రయత్నం చేశారని తెలిపారు. తద్వారా లక్షన్నర కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా కాకుండా అడ్డుకున్నామని తెలిపారు. జీఎస్టీ విషయంలో కూడా తాము ధైర్యంగా ముందడుగు వేయడంతో ప్రస్తుతం 99 శాతం వస్తువులు తక్కువ ధరకు దొరుకుతున్నాయని తెలిపారు. స్వార్థ రాజకీయం తమ విధానం కాదని.. దేశ శ్రేయస్సే తమకు ముఖ్యమని మోదీ అన్నారు. ప్రభుత్వ చర్యల ద్వారా తక్కువ కాలంలోనే 7 కోట్ల మంది ఇళ్లలో టాయ్‌లెట్లు నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు. దేశంలో నీతివంతమైన వ్యాపార దృక్పథానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe