Breaking News

బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యక్తి హత్య

Nov 27, 2019 01:30 by Admin Admin

బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో శ్రీలంక బస్తిలో రషీద్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇంతియాజ్, ఇమ్రాన్ అనే ఇద్దరు వ్యక్తులు రషీద్‌ను కత్తితో పొడిచి చంపేశారు. అనంతరం బేగంపేట పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రషీద్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. నెల రోజుల్లోనే బేగం‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇది రెండో ఘటన కావడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe