Breaking News

ప్లాస్టిక్ కవర్ ఇచ్చినందుకు జరిమానా

Nov 27, 2019 01:36 by Admin Admin

ప్లాస్టిక్ కవర్‌లు వాడుతున్నాడంటూ తోపుడు బండిపై బజ్జీలు, పునుగులు అమ్మకుంటున్నవ్యాపారికి మున్సిపల్ సిబ్బంది రూ. 200 జరిమానా విధించారు.  వ్యాపారి లబోదిబోమన్నారు. రోజంతా వ్యాపారం చేసిన వంద కూడా మిగలడం లేదని, జరిమానా ఎలా కట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద గోడౌన్లు పెట్టి ప్లాస్టిక్ అమ్మే వారిని వదిలి పెట్టి... తనకు జరిమానా విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తోపుడు బండిని తానే ధ్వంసం చేసుకున్నాడు. ఈ ఘటనతో స్థానికులు నివ్వెరపోయారు. మున్సిపల్ సిబ్బంది తీరుపై మండిపడ్డారు.

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe