Breaking News

శబరిమలలో మహిళా కార్యకర్తపై పెప్పర్ స్ప్రేతో దాడి

Nov 27, 2019 01:42 by Admin Admin

శబరిమల ఆలయంలోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఒక మహిళా కార్యకర్తపై పెప్పర్ స్ప్రేతో దాడి చేశారు. మహిళా కార్యకర్త బిందు అమ్మినీ శబరిమల ఆలయంలోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఆమెను గమనించిన ఒక యువకుడు ఆమెపై పెప్పర్ స్ప్రేతో దాడి చేశాడు. ఈ దాడి పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదుటనే జరగడం విశేషం. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియోను మొబైల్ ఫోనులో చిత్రీకరించారు. దానిలో అమ్మినీ తన ముఖాన్ని దాచుకుని, ఒక యువకుని నుంచి దూరంగా పారిపోతుండటం కనిపిస్తుంది. బిందూను ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe