Breaking News

పవన్‌ కల్యాణ్‌ పర్యటన ఖరారు

Nov 28, 2019 07:04 by Admin Admin

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ పర్యటన ఖరారైనట్లు ఆ పార్టీ కడప జిల్లా నాయకుడు సుంకర శ్రీనివాస్‌ తెలిపారు. స్థానికంగా గల సుంకర నివాసంలో బుధవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించి పవన్‌ జిల్లా పర్యటన వివరాలు వెల్లడించారు. డిసెంబరు 1న మధ్యాహ్నం 3గంటల కు రైల్వేకోడూరు చేరుకుంటారని తెలిపారు. అక్కడ పసుపు రైతులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం తిరుపతి చేరుకుని బస చేస్తారన్నారు. 3న కడప, రాజంపేట పార్లమెంటు జనసేన శ్రేణులతో తిరుపతిలో సమీక్షలు నిర్వహిస్తారన్నారు. సమావేశంలో జనసేన జిల్లా నాయకులు సుంకర శ్రీనివా్‌సతో పాటు జనసేన వీరమహిళ జ్యోతి, పత్తి విస్సు, చలపతి, గోపి, శేషు, హరి పాల్గొన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe