Breaking News

సీఎంగా ప్రమాణం చేయనున్న ఉద్ధవ్ ఠాక్రే

Nov 28, 2019 07:09 by Admin Admin

మహారాష్ట్ర రాజకీయం  ఓ కొలిక్కి వచ్చింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే రేపు సాయంత్రం 6.40 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఇదివరకు జరిగిన మహారాష్ట్ర వికాస అఘాడీ భేటీ ముగిసింది. భేటీ అనంతరం ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్ మీడియాతో మాట్లాడారు. ముంబైలోని శివాజీ పార్కులో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. భేటీలో పదవుల పంపకంపై మూడు పార్టీల మధ్య సయోధ్య కుదిరిందని ప్రపుల్ పటేల్ తెలిపారు. సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే, మరో ఆరుగురు(ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు చొప్పున) మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe