Breaking News

డాక్టర్‌ ప్రియాంకరెడ్డి దారుణ హత్య

Nov 28, 2019 17:10 by Admin Admin

షాద్‌నగర్‌ సమీపంలో హత్యకు గురైన మహిళను వెటర్నరి డాక్టర్‌ ప్రియాంక రెడ్డిగా పోలీసులు గుర్తించారు. నవాబుపేట మండలం కొల్లూరులో ఆమె డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రియాంకారెడ్డి స్వస్థలం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ దగ్గర నర్సాయపల్లి. దుండగులు చెటాన్‌పల్లి బైపాస్‌ రోడ్డు అండర్‌ బ్రిడ్జి కింద హతమార్చి తగులబెట్టారు. మృతదేహం పూర్తిగా కాలిపోయింది. ప్రియాంకారెడ్డి ఉదయం స్కూటీ మీద ఆఫీస్‌కు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఉండగా స్కూటీ పాడైపోయిందని సోదరికి ఫోన్‌ చేసి చెప్పింది. హైవేపై భయమవుతోందని తెలిపింది. ఇంటికి కాల్‌ చేసిన కాసేపటికే ప్రియాంక ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ అయింది. తెల్లారేసరికి ప్రియాంకారెడ్డి మృతదేహం కాలిబూడిదైంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe