Breaking News

700 కోట్లతో స్కైవర్త్ ఉత్పత్తుల తయారీ యూనిట్

Nov 30, 2019 06:25 by Admin Admin

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ స్కైవర్త్ తెలంగాణలో తన ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో స్కైవర్త్ గ్రూప్ బోర్డు చైర్మన్ లై వీడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వ ఉన్నతాధికారులతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి స్కైవర్త్ కంపెనీ తెలంగాణలో దశలవారీగా పెట్టుబడులు పెట్టనున్నది. మొదటి దశలో హైదరాబాద్ కేంద్రంగా రూ.700 కోట్లతో 50 ఎకరాల్లో అత్యాధునిక ఉత్పాదక ప్లాంటును ఏర్పాటుచేయనున్నది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రంగ పెట్టుబడి కానున్నది. అదేవిధంగా భారత్‌లో అతిపెద్ద చైనీస్ ఎలక్ట్రానిక్స్ పెట్టుబడుల్లో ఒకటిగా నిలువనున్నది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe