Breaking News

రిపోర్టులో గుండె చెరువయ్యే విషయాలు

Dec 01, 2019 03:45 by Admin Admin

వైద్యురాలి Priyanka Reddy హత్య రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నిందితులైన (మహ్మద్‌ ఆరిఫ్‌, జొల్లి శివ, చెన్న కేశవులు, నవీన్ కుమార్‌ను) మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించగా పోలీసులు  భద్రత నడుమ చర్లపల్లి జైలుకు తరలించారు. రిపోర్టులో గుండె చెరువయ్యే విషయాలు వెలుగుచూశాయి. స్కూటర్‌ టైర్ పంక్చర్ చేయించుకోస్తానని చెప్పిన మహ్మద్ అరీఫ్.. వైద్యురాలి సెల్‌ఫోన్‌ నెంబర్‌ను తీసుకున్నాడు. పంక్చర్ చేయించుకోస్తానని వెళ్లిన మహ్మద్ ఆరీఫ్ ఎంతకూ రాకపోవడంతో అతనికి వైద్యురాలు ఫోన్ చేసింది. ఈ ఫోన్ కాల్ ఆధారంగానే పోలీసులు మహ్మద్‌ అడ్రస్‌ను ట్రేస్ చేశారు.
 
వైద్యురాలిపై బలత్కారానికి పాల్పడే క్రమంలో నిందితులు క్రూరంగా ప్రవర్తించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఆమె హెల్ప్‌ హెల్ప్‌ అని వేడుకున్నా నిందితులు కనికరించలేదు. అంతేకాకుండా ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. ఆపై ఒకరి తరువాత ఒకరుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు అరుస్తుండటంతో గట్టిగా ముక్కు, నోరు మూశారు. దీంతో ఊపిరాడక వైద్యురాలు అపస్మారస్థితిలోకి వెళ్లింది. అలా రాత్రి 9:30 నుండి 10:20 వరకు కిరాతకులు వైద్యురాలిపై అత్యంత దారుణంగా  అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మృతదేహాన్ని లారీ క్యాబిన్‌లోకి దుండగులు ఎక్కించారు. లారీలోకి ఎక్కించిన తర్వాత మృతదేహంపైనా కీచకులు ఒకరి తరువాత అత్యాచారం చేశారు. అక్కడి నుంచి బయలుదేరి షాద్‌నగర్‌ బ్రిడ్జి దగ్గర కిందకి దించే సమయంలో బతికి ఉందన్న అనుమానంతో వైద్యురాలిని దుండగులు కాల్చిచంపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe