Breaking News

కేదారినాథ్‌ మంచు దుప్పటి కప్పుకుంది

Dec 01, 2019 03:49 by Admin Admin

కేదారినాథ్‌ మంచు దుప్పటి కప్పుకుంది. శీతాకాలం కావడంతో గుడి పరిసర ప్రాంతాలన్నీ మంచు దుప్పటి పరుచుకున్నట్లున్నాయి. శీతాకాలం సమీపించే సమయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా గుడిని తాత్కాలికంగా మూసేస్తారన్న విషయం తెలిసిందే. విపరీతమైన మంచుతో ప్రయాణీకులు, భక్తులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటుంది. కేదారినాథ్‌తో పాటు, అమర్‌నాథ్‌ సహా చార్‌ధామ్‌ ఆలయాలను శీతాకాల సమయంలో మూసేస్తారు.

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe