Breaking News

జీవిత బీమా సంస్థలో ఉచిత శిక్షణా

Dec 04, 2019 03:44 by Admin Admin

జీవిత బీమా సంస్థలో అసిస్టెంటు ఉద్యోగాల నియామకాలకు ఉద్దేశించిన మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఇన్షూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్(ఐసీఈయు) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు యూనియన్ హైదరాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎన్ ఆదీశ్ రెడ్డి తెలిపారు. ఈ శిక్షణా తరగతులు ఈనెల ఆరు నుంచి 20వ తేదీవరకు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు దోమలగూడలోని ఎన్‌టీఆర్ స్టేడియం ఎదురుగా, చెన్నుపాటి భవన్‌లోని టీఎస్‌యుటీఎఫ్ కార్యాలయంలో జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తిచేశారు. వివరాలకు 040-23420701 ఫోన్ నెంబరుపై సంప్రదించవచ్చు

Facebook like
Google Plus Circle
Youtube Subscribe