Breaking News

నిఖిల్ తన కొత్త చిత్రానికి పచ్చజెండా

Dec 04, 2019 03:48 by Admin Admin

నిఖిల్ తన కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపాడు. కుమారి 21ఎఫ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రకాక్ దర్శకత్వంలో నిఖిల్ సినిమా చేయనున్నాడు. గీతాఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి.

 

టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. బన్నీవాసు నిర్మాత. సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు టాక్. దీనికి సంబంధించిన నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటించనుంది చిత్రయూనిట్. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నటించే అవకాశం గొప్ప, అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు నిఖిల్ ట్వీట్ చేశాడు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe