Breaking News

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని

Dec 04, 2019 03:52 by Admin Admin

దేశంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని టీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ కేంద్రాన్ని కోరారు. నేడు లోక్ సభలో ఎంపీ పసునూరి మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంతోపాటు 20 వేల కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. 9వేల 500 చెరువులను పూడికతీశామన్నారు. రైతుబంధు పథకం కింద ప్రతీ రైతుకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నారని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందిస్తూ..దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe