Breaking News

IPL 2020. 2 కోట్ల క్లబ్‌లో ఉన్న ఆటగాళ్లు వీరే

Dec 04, 2019 03:59 by Admin Admin

కోల్‌కతాలో 19th Dec 2019 ఐపీఎల్ ఆటగాళ్ల వేలం జరగనుంది. మొత్తం 971 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. వీరిలోంచి కేవలం 73 మందిని మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఫ్రాంచైజీలకు ఉంది. ఈ వేలంలో అత్యధిక బేస్ ప్రైస్ కలిగిన ఆటగాళ్లలో పాట్ కమిన్స్, హేజల్‌వుడ్, క్రిస్ లిన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, డేల్ స్టెయిన్, ఏంజెలో మాథ్యూస్ ఉన్నారు. వీరిందరి కనీస ధర రెండు కోట్ల రూపాయలు. వీరిని దక్కించుకోవాలనుకున్న ఫ్రాంచైజీలు కనీస ధర, లేదంటే అంతకంటే ఎక్కువ మొత్తంతో కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
రూ.1.5 కోట్ల క్లబ్‌లో రాబిన్ ఉతప్ప, షాన్ మార్ష్, కేన్ రిచర్డ్‌సన్, ఇయాన్ మోర్గాన్, జేసన్ రాయ్, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, క్రిస్ మోరిస్, కైలీ అబ్బాట్ తదితరులు ఉన్నారు. ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్‌కు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించాడు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe