Breaking News

తప్పంతా అభిమానులదే

Dec 04, 2019 04:08 by Admin Admin

తప్పంతా ఈ దరిద్రపు అభిమానులదే. 100% అభిమానులదే. వాళ్ల అభిమాన హీరో బాధపడుతుంటే.. అభిమానులు కూడా బాధపడాలే కానీ సెల్ఫీలేంటి.. జిందాబాద్‌లేంటి?. బాధితుల కుటుంబం బాధపడుతుంటే హీరో జిందాబాద్.. పులికేకలు వేస్తే ఎలా ఉంటుంది..? 
సమాజం సెలబ్రిటీలతో సెల్ఫీలు తీసుకునేందుకు ఉంటుంది. దిశ ఘటనపై బాధపడేవారికంటే.. సెలబ్రిటీలతో సెల్ఫీలు తీసుకుందామనే దరిద్రులు ఎక్కువగా ఉంటారు. ఆ దరిద్రం రాని రోజే సినిమావాళ్లు బయటికొస్తారు.. అప్పటిదాకా బయటికి రారు. సెలబ్రిటీలకు నిజంగా బాధ ఉంది.. మనస్పూర్తిగానే బాధపడుతున్నారు. ఆ నిందితులను చంపేయాలంత కోపంతోనూ ఉన్నారు. కానీ బయటికొస్తే ఈ సెల్ఫీల గొడవేంటి..? ఎవరైనా చనిపోయిన దగ్గరికెళ్లినా ఇదే సెల్ఫీల గోల.. కేకలేస్తారు.. జిందాబాద్ అంటారు.. ఏంటీ దరిద్రం.!. ఈ దరిద్రపు కల్చర్ పోయేదాకా ఎవరేం చేయలేమిక్కడ..? అందుకే సినిమా వాళ్లు బయటికి రావడానికి సిగ్గుపడుతున్నారు. మేం నిరసన తెలియడానికి వచ్చి అక్కడున్న పరిస్థితిని చెడగొట్టిన వాళ్లమవుతాం. ఈ పరిస్థితి మన తెలుగువాళ్లలోనే ఉంది. జనాలు ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావట్లేదు’ అని ఆయన ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు.
 

 

నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినందుకు సెలబ్రిటీలు సిగ్గుపడతారు’ అని తమ్మారెడ్డి తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe