Breaking News

దుండగులను పరుగెత్తించి మరీ కాల్చి చంపాలి

Dec 08, 2019 05:08 by Admin Admin

ఉన్నావ్‌ లైంగికదాడి బాధితురాలి మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఏడాది కింద బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడడమే కాకుండా ఇటీవల, ఆమెను సజీవంగా దహనం చేసేందుకు ప్రయత్నించిన దుండగులను  ‘ఎన్‌కౌంటర్‌' కాల్చిపారేయాలని లేదా ఉరితీసి చంపాలని వారు డిమాండ్‌ చేశారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకుగాను  ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు అప్పగిస్తామని యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ చెప్పారు. 90 శాతం కాలిన గాయాలకు గురైన బాధితురాలు 40 గంటలపాటు మృత్యువుతో పోరాడి శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తీవ్రంగా గాయపడిన ఆమెను తొలుత ఉన్నావ్‌ నుంచి లక్నోకు తరలించిన అధికారులు ఆ తరువాత ఢిల్లీకి తీసుకొచ్చారు. కాలిన గాయాల నేపథ్యంలో గుండెపోటుతో ఆమె మరణించిందని పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు తెలిపారు.

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe