Breaking News

ప్లాస్టిక్‌ ద్వారా శరీరంలోకి విష రసాయనాలు

Dec 08, 2019 05:37 by Admin Admin

అన్నం తినే ప్లేటు ప్లాస్టిక్‌.. నీళ్లు తాగే బాటిల్‌ ప్లాస్టిక్‌.. బయట ఏమన్నా తెచ్చుకున్నా ప్యాక్‌ చేసేది ప్లాస్టిక్‌.. మన జీవితంలో ప్లాస్టిక్‌ తప్పించుకోలేనిదిగా మారింది. అయితే ఈ ప్లాస్టిక్‌ ద్వారా మనకు తెలియకుండానే బీపీఏ అనే రసాయనం మన శరీరంలోకి వెళ్తోందని శాస్త్రవేత్తల తాజా పరిశోధనల్లో తేలింది. అమెరికా పరిశోధకులు కొంత మంది మూత్ర నమూనాలు పరిశీలించగా, వారిలో సాధారణం కంటే 44 రెట్లు ఎక్కువ బీపీఏ ఉన్నట్లు వెల్లడైంది. ఇది సంతానోత్పత్తి, మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని శాస్త్రవ్తేతలు చెప్పారు. ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికే కాకుండా మానవ శరీరానికి కూడా ముప్పేనని హెచ్చరించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe