Breaking News

ఛపాక్‌ చిత్రం ట్రైలర్‌ విడుదల

Dec 09, 2019 15:28 by Admin Admin

బాలీవుడ్ హీరోయిన్‌ దీపికా పదుకొనే నటిస్తున్న తాజా చిత్రం ఛపాక్‌. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా దీపిక స్వయంగా నిర్మిస్తున్న  మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.   దీపికా ఆరు సెకన్ల టీజర్‌ను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. దీనికి ‘ ఛపాక్‌ చిత్రం ట్రైలర్‌  విడుదలవుతుంది. తప్పక చూడండి’ అంటూ ఆమె కామెంట్‌ చేశారు. వెరైటీగా ఉన్న ఈ టీజర్‌లో ‘రేపు ట్రైలర్‌ విడుదల’ అని కనిపిస్తుంది. ఇలా కథకు దగ్గరగా కొత్తగా ఉన్న టీజర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ టీజర్‌ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో దీపికా లుక్‌కు సంబంధించి పలు ఫోటోలను ఇప్పటికే చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌కు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్‌ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe