Breaking News

పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించిన రాజ్యసభ

Dec 12, 2019 05:58 by Admin Admin

‘పౌరసత్వ సవరణ బిల్లు-2019’ (క్యాబ్‌) పార్లమెంట్‌ ఆమోదం పొందింది. లోక్‌సభ ఆమోదించిన బిల్లు ను బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా 125-105 తేడాతో ఎగువసభ ఆమోదం పలికింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా బుధవారం ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆరున్నరగంటలకుపైగా బిల్లుపై చర్చ జరిగింది. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, మతం ప్రాతిపదికన ప్రజలమధ్య విభజన రేఖ గీస్తున్నదని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. శరణార్థుల జాబితాలో ముస్లింలను చేర్చకపోవడాన్ని ప్రశ్నించాయి. అమిత్‌షా సమాధానమిస్తూ దేశంలోని ముస్లింలకు ఈ బిల్లుతో ఎలాంటి నష్టం కలుగదని స్పష్టంచేశారు. ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 105 మంది ఎంపీలు ఓటేశారు. ఈ బిల్లుకు లోక్‌సభలో మద్దతు తెలిపిన శివసేన.. రాజ్యసభలో ఓటింగ్‌ను బహిష్కరించింది. ఈ బిల్లుకు జేడీయూ, అకాలీదళ్‌, ఏఐఏడీఎంకే, వైసీపీ, టీడీపీ, బీపీఎఫ్‌ తదితర పార్టీలు మద్దతు తెలుపగా, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, ఎన్సీపీ, డీఎంకే, జేడీఎస్‌ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. బిల్లు ఆమోదంపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందిస్తూ ‘ప్రజాస్వా మ్య చరిత్రలో ఇదో చీకటిరోజు’గా అభివర్ణించారు. బీజేపీ ప్రమాదకరమైన విభజన ఎజెండాను అమలుచేస్తున్నదని ఆరోపించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe