Breaking News

టీమ్‌ఇండియా చాంపియన్‌

Dec 12, 2019 06:07 by Admin Admin

ఆఖరి పోరాటంలో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. తొలుత టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ సారథి పొలార్డ్‌..భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కొట్టిన పిండిలాంటి సొంత ఇలాఖాలో హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ(71) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తానేం తక్కువ కాదన్నట్లు కేఎల్‌ రాహుల్‌(91) కూడా జతకలువడంతో వాంఖడే స్టేడియంలో పరుగులు పోటెత్తాయి. తొలి ఓవర్‌ మినహా రెండో ఓవర్‌ నుంచి రోహిత్‌, రాహుల్‌...విండీస్‌ బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ ముందుకు సాగారు. హోల్డర్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో రాహుల్‌ వరుస బౌండరీలతో చెలరేగితే..ఆ మరుసటి ఓవర్లో కాట్రెల్‌ను రోహిత్‌ ఓ భారీ సిక్స్‌, రెండు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 400ల సిక్స్‌ల మైలురాయి అందుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఈ ఇద్దరు బ్యాట్లు ఝలిపించడంతో పొలార్డ్‌ చేష్టలుడిగిపోయాడు. దూకుడును అడ్డుకునేందుకు స్పిన్నర్‌ పియరీని ప్రయోగించినా లాభం లేకపోయింది. వచ్చి రావడంతోనే రోహిత్‌ కండ్లు చెదిరే సిక్స్‌తో పియరీకి స్వాగతం పలికాడు.

మరో సిక్స్‌ బాదే క్రమంలో బౌండరీ దగ్గర లెవిస్‌ మెరుపు ఫీల్డింగ్‌తో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మరో ఎండ్‌లో రాహుల్‌ కూడా రోహిత్‌ను అనుసరిస్తూ స్కోరుబోర్డును పరిగెత్తించాడు. కెస్రిక్‌ విలియమ్స్‌ను వరుసగా మూడు బంతుల్లో 4, 6, 4 బాదడంతో పవర్‌ ప్లే ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. వీరిద్దరి జోరు చూస్తే వాంఖడేలో పరుగులు పండుగ ఖాయమనుకుంటున్న అభిమానుల అంచనాలను నిజం చేస్తూ రోహిత్‌ మరోమారు రెండు వరుస సిక్స్‌లు, ఫోర్‌తో పియరీని ఆటాడుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్‌ 23 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరి జోరు చూస్తే సెంచరీలు ఇక ఖాయమే అనిపించింది. కానీ భారీ షాట్‌ ఆడే క్రమంలో విలియమ్స్‌ బౌలింగ్‌లో రోహిత్‌..వాల్ష్‌కు చిక్కాడు. దీంతో తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్‌ పడింది.

స్కోరుబోర్డు

భారత్‌: రోహిత్‌(సి)వాల్ష్‌(బి)విలియమ్స్‌ 71, రాహుల్‌(సి)పూరన్‌(బి)కాట్రెల్‌ 91, పంత్‌(సి)హోల్డర్‌(బి)పొలార్డ్‌ 0, కోహ్లీ 70 నాటౌట్‌, అయ్యర్‌ 0 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 240/3; వికెట్ల పతనం: 1-135, 2-138, 3-233; బౌలింగ్‌: కాట్రెల్‌ 4-0-40-1, హోల్డర్‌ 4-0-54-0, పియరీ 2-0-35-0, విలియమ్స్‌ 4-0-37-1, వాల్ష్‌ 4-0-38-0, పొలార్డ్‌ 2-0-33-1.

వెస్టిండీస్‌: సిమన్స్‌ (సి)అయ్యర్‌(బి)షమీ 7, కింగ్‌(సి)రాహుల్‌(బి)భువనేశ్వర్‌ 5, హెట్‌మైర్‌ (సి)రాహుల్‌(బి)కుల్దీప్‌ 41, పూరన్‌(సి)దూబే(బి)చాహర్‌ 0, పొలార్డ్‌ (సి/సబ్‌ జడేజా)(బి)భువనేశ్వర్‌ 68, హోల్డర్‌(సబ్‌/పాండే)(బి)కుల్దీప్‌ 8, వాల్ష్‌ (బి) షమీ 11, పియరీ(సబ్‌/జడేజా)(బి)చాహర్‌ 6, విలియమ్స్‌ 13 నాటౌట్‌, కాట్రెల్‌ 4 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 173/8; వికెట్ల పతనం: 1-12, 2-17, 3-17, 4-91, 5-103, 6-141, 7-152, 8-169; బౌలింగ్‌: చాహర్‌ 2-0-9-1, భువనేశ్వర్‌ 2-0-12-1, షమీ 2-0-15-1, దూబే 3-0-32-0, కుల్దీప్‌ 4-0-45-2, సుందర్‌ 1-0-5-0.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe