Breaking News

బహుముఖ ప్రయోజనాలు

Dec 12, 2019 06:15 by Admin Admin

గోదావరిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా సాగునీరందుతున్నా వాటిద్వారా చెప్పుకోదగిన రీతిలో జలవిద్యుదుత్పత్తి జరుగటం లేదు. ఆ లోటును తీర్చేలా దుమ్ముగూడెం వద్ద బరాజ్‌ను నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ బరాజ్ ద్వారా సాగునీటితోపాటు పెద్దఎత్తున విద్యుదుత్పత్తి జరిగేలా నిర్మించనున్నారు. దుమ్ముగూడెం వద్ద 37 టీఎంసీల నీటినిల్వతో చేపడుతున్న ఈ బరాజ్ వద్ద సాంకేతికంగా హెడ్ అనుకూలంగా ఉండటంతో 320 మెగావాట్ల విద్యుదుత్పాదనకు అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు గోదావరిపై పోచంపాడు (36 మెగావాట్లు), నిజాంసాగర్ (10 మెగావాట్లు) సింగూరు (15 మెగావాట్లు) విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. వీటన్నంటి ద్వారా 61 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతున్నది. దుమ్ముగూడెంతో గోదావరిపై సామర్థ్యం 381 మెగావాట్లకు పెరుగనున్నది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe